మోర్తాడ్, బతుకమ్మ: సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు మరువ లేనివని ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి మన దేశ మొట్టమొదటి రెండవ ప్రథమ పౌరునిగా, అలాగే ప్రథమ పౌరునిగా బాధ్యతలు చేపట్టడం చాలా గొప్ప విషయం అని మాజీ పిఆర్టియు రాష్ట్ర బాధ్యులు మాదర్ రాజన్న అన్నారు. ఏ వృత్తి చేపట్టాలన్న వారికి బీజం పాఠశాలలోని ఉపాధ్యాయుల తోనే మొదలవుతుందని, అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని తెలియజేయడం జరిగింది. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యాయ బృందం, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందానికి శాలువాలు పూలమాలతో సత్కారం చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు రఘునందన చారి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
