- జిల్లా వైద్య ఆరోగ్యఅధికారిని డాక్టర్ బి. రాజశ్రీ
భీంగల్, బతుకమ్మ : టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మే 26 వ తేది నుండి ఆగష్టు 30 వ తేది వరకు నిర్వహించనున్న టిబి సర్వే ప్రారంభం అయ్యిందని డీఎంహెచ్ఓ డాక్టర్. రాజశ్రీ అన్నారు. సోమవారం ఆమె టీబి నిర్ధారణ సర్వే కార్యక్రమాన్ని ఖానాపూర్ బస్తీ దావఖనలో డీ ఎం. ఎచ్ ఓ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని గ్రామాలలో పర్యటిస్తారని ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. క్షయ వ్యాధి కి గురి కావడానికి అవకాశాలు ఉన్న మధుమేహం, కాన్సర్,రక్తపోటు,గతంలో టిబి వ్యాధి కి గురిఅయిన వారు, 60 సంవత్సరాల వయసు పైబడిన వారు,ఫ్యాక్టరీ లలో పని చేసే వారు,దూమపానం,మద్యపానం చేసే వారు పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వీరితో పాటు క్షయ లక్షణాలు ఉన్నవారికి క్షయ పరీక్షలు, ఛాతి ఎక్స రే చేయడం జరుగుతుందని,ఒకవేళ టిబి నిర్దారణ అవుతే వారికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలోకి ప్రతీ నెల 1000/- వెయ్యి రూపాయల చొప్పున ఆరు నెలలు జమ చేస్తారని వివరించారు. పోషకాహర నిమిత్తం ఈ డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లోజిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి,ఇంచార్జ్ డిప్యూటీ డి యం చ్ వో తుకారాం రాటోడ్,డాక్టర్ అవంతి, డాక్టర్ ప్రత్యుష, టిబి కోఆర్డినేటర్ రవి,హెల్త్ సూపెర్వైసర్ మధుకర్,సి ఎస్ వో నవీన్,లక్ష్మణ్, నరేష్, స్రవంతి, భూపాల్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
