బతుకమ్మ, ముప్కల్: జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 410 జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ముక్కాల మండలం రెంజర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి విద్యార్థులు అంకిత, వైశాతి, శ్రీనాయాన్, సాయి, శరణ్య, సాహిత రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని రవికుమార్ తెలిపారు. సైన్స్ ఫెయిర్ కు గైడ్స్ గా పాఠశాల ఉపాధ్యాయులు మల్లేష్, శ్రీనివాస్ వ్యవహరించారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయ బృందం వారిని అభినందించారు.
