24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రోటరీ క్లబ్ అందజేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమాజ సేవలో రోటరీ క్లబ్ ముందు వరుసలో ఉంటుంది

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, నగరవాసులు రోటరీ క్లబ్ అందజేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని బర్కత్ పుర లో గల రోటరీ కేంద్రంలో సోమవారం వినికిడి సాధన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటరీ అంటేనే సేవా కార్యక్రమాలతో పేరుపొందిందన్నారు. వికలాంగులకు జైపూర్ కాళ్ళను అందించడం, వినికిడి సమస్య ఉన్నవాళ్లకు పరికరాలు అందించడం అభినందనీయమన్నారు.

 

Take advantage of the services provided by the Rotary Club.

 

గతంలోనూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. వినికిడి లోపం ఉన్నవారు, మొహమాటం పడకుండా పరికరాలను వాడాలని సూచించారు. ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో రెండు లక్షల విలువ గల వినికిడి పరికరాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 18 మందికి వినికిడి సాధన పరికరాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, దాంపల్లి జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, రోటరీ ట్రస్ట్ చైర్మన్ ఆకుల అశోక్ క్లబ్ డైరెక్టర్ రాజ్కుమార్ సుబేదార్, కార్యనిర్వాహణాధికారి డాక్టర్ హరీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Take advantage of the services provided by the Rotary Club.

More articles

Latest article