ముదుపర్లకు రూ.40,250 కోట్ల నష్టం
బిజినెస్, బతుకమ్మ : స్టాక్ ఎక్స్చేంజీల్లో సోమవారం స్విగ్గీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇటీవల ఈసంస్థ త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో కొన్ని బ్రోకరేజీ సంస్థలు రేటింగ్ ను తగ్గించాయి. దీంతో అప్పటి నుంచి షేర్లు కుదేలవుతున్నాయి. ఇప్పటివరకు కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.40,250 కోట్ల మేర తగ్గింది.
