డంకీ రూట్లో అమెరికా వెళ్తూ.. భారతీయుడి మృతి
ఇంటర్నేషనల్, బతుకమ్మ : డంకీ రూట్లో అమెరికా వెళ్తూ పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ (33) మార్గ మధ్యలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈఘటన గ్వాటెమాలాలో చోటు చేసుకుంది. చండీఘడ్ లోని ఓ ఏజెంట్ అతడి వద్ద రూ.16.5 లక్షలు తీసుకొని పంపించాడు. దీంతో అగ్రరాజ్యంలోకి అక్రమంగా వెళ్లగలిగే మార్గాలపై చర్చ మొదలైంది. కాగా, అక్రమంగా తమ దేశానికి వచ్చన వారిని అమెరికా తిప్పి పంపిస్తున్న విషయం తెలిసిందే.