23.4 C
Hyderabad

సీసీ కెమెరాల నిఘాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

Ganesh Navaratri celebrations under CCTV surveillance

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అన్ని గణేష్ మండపాలను జియో ట్యాగింగ్ అనుసంధానం

. . . పోలీస్ కమీషనర్ సాయిచైతన్య వెల్లడి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు వరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ డివిజన్ వరిధిలో గణేష్ మండపాల పై పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడించారు.  గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలతో పాటు వాటి పరిసరా ప్రాంతాల్లోను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు కార్యచరణ ప్రణాళికతో పోలీస్ కమీషనరేటు వరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు పోలీస్ భద్రత కల్పించడం జరుగుతుందని సీపీ తెలిపారు. నిజామాబాద్ కమీషనరేటు వరిధి లో మొత్తం  5681   గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో నిజామాబాద్ డివిజన్ వరిధి లో  2545 విగ్రహాలు,ఆర్మూర్ డివిజన్ వరిధిలో 1959 విగ్రహాలు, బోధన్ డివిజన్ పరిధిలో 1177 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గణేష్ విగ్రహాలకు భద్రత కల్పించడం కోసం వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా విగ్రహాల ఏర్పాటుకు అవసరమయిన పోలీస్ అనుమతుల కై గణేష్ నవరాత్రి నిర్వహాకులు సంబంధిత పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఆన్ లైన్ విధానం ద్వారా ధరఖాస్తు చేసుకున్న గణేష్ నవరాత్రి నిర్వహాకుల కు విగ్రహా ఏర్పాటుకు స్థానిక పోలీసులు అనుమతులను మంజూరు చేయడం జరిగిందన్నారు.పోలీనులు గణేష్ మండపాలకు కల్పించడంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ వరిదిలో ఏర్పాటు చేసిన ప్రతి గణేష్ విగ్రహాన్ని జియో ట్యాగింగ్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ వరిధిలో సెక్టార్ ల వారి పెట్రోలింగ్ నిర్వహించే బ్లూకోర్డ్స్ సిబ్బంది తమ సెక్టార్ వరిధిలోని గణేష్ నవరాత్రులు నిర్వహించే గణపతి మండపాలను క్షేత్ర స్థాయిలో నందర్శించి వారి వద్దనున్న ట్యాబ్ ల ద్వారా సంబంధిత గణేష్ మండపాల చిత్రాలను తీసుకోవడంతో పాటు మండపాల నిర్వహాకులకు నంబందించి వూర్తి నమాచారాన్ని సేకరించి పోలీస్ వెబ్ ఆప్లికేషన్ ద్వారా క్షేత్ర స్థాయిలో జియో ట్యాగింగ్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. 24 గంటలు బ్లూకోర్డ్స్ సిబ్బంది పర్యవేక్షణ జరుపుతుందన్నారు. పెట్రో కార్ సిబ్బంది ప్రతిరోజు మూడు షిఫ్టుల వారిగా మూడు పర్యాయాలు మండపాలను సందర్శించి అక్కడి పరిస్థితులపై అధ్యాయం చేస్తూ భద్రత విషయంలో నిర్వాహకులకు సూచనలు చేస్తూ మండపాల వారిగా జారీ చేసినా పాయింట్ బుక్కు లో  సెక్టార్ పోలీసు సిబ్బంది సంతకము చేయడం జరుగుతుంది. నిమజ్జనానికి సి.సి కెమెరాల ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ లో ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్ లో దాదావు 100 సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందని,. ఈ కెమెరాలు ఐ.పి టెక్నాలజీ తో రూపోందించడం జరిగిందన్నారు. ఈ సి.సి టివిలు 24 X 7 ప్రకారంగా వూర్తిగా సిబ్బంది వర్యవేక్షణలో ఉంటుందన్నారు.

More articles

Latest article