26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కబ్జాకు గురైన శివాలయ భూమిని త్వరలో సర్వే చేయిస్తా

Must read

📰 Generate e-Paper Clip

  • గత ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లు బాకీ చేసింది
  • రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ:  సిరికొండ మండలంలోని  చీమను పల్లి గ్రామంలో  సిరికొండ వేములవాడ ఆర్ అండ్ బి రోడ్డుకు రెండు కోట్ల నిధులతో  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీమలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ, చీమన్ పల్లి గ్రామనికి ఇప్పటి వరకు ఐదు కోట్ల నిధులు కేటాయించి పనులు నడుస్తున్నాయని  ఎమ్మెల్యే భూపతి రెడ్డి  అన్నారు.  చీమన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, పేదవారి కలను  కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. గ్రామంలో ఉన్న శివాలయం కబ్జాకు గురి అయిందని  వచ్చిందని, తమకు ఫిర్యాదు వచ్చిందని  జిల్లా కలెక్టర్ తో మాట్లాడి  సర్వే చేయిస్తానని అన్నారు. దేవుడు భూమిని ఎవరు కబ్జా చేసిన చట్టా పరమైన   చర్యలు ఉంటాయని అన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి త్వరలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి  మహిళలకు పెద్దపీట వేస్తుందని, ఉచిత రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, అద్దె బస్సులు , సోలార్ ప్లాంట్ లు వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా  చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అప్పు కట్టడానికి నిధులను  సరిపోతున్నాయని ఎమ్మెల్యేభూపతి రెడ్డి అన్నారు. చీమనపల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన స్థలాన్ని, ఆరోగ్య కేంద్రానికి కేటాయించడం జరిగిందని, ఇక్కడి ప్రజలకు దగ్గరలో ఉండాలని  సీఎంతో మాట్లాడి  ఆ స్థలానికి కేటాయించమని అన్నారు. చీమలపల్లి గ్రామానికి త్వరలో బ్యాంకు కేటాయించి ప్రారంభిస్తామని అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తామని అన్నారు.  అలాగే ఇక్కడ ఉన్న బీసీ రెసిడెన్షియల్  స్కూల్ కొన్ని కారణాల చేత ధర్పల్లికి మార్చడం జరిగిందని, అది అక్కడనే ఉంటదని అనుకోవద్దని, చీమనుపల్లి గ్రామంలో గవర్నమెంట్ భూమి ఉంటే మంచి భవనాన్ని నిర్మించి మళ్లీ ఇక్కడికి తెప్పిస్తామని అన్నారు. అలాగే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు జరిగిందని, ప్రస్తుతం 250 మందికి సరిపడే విధంగా ఉందని, విద్యార్థులు 450 ఉన్నారని, ఎస్సీ కార్పొరేషన్  ప్రిన్సిపల్ సెక్రెటరీ తో మాట్లాడి అదనంగా గదులు ఏర్పాటు చేయాలని మాట్లాడడం జరిగిందని అన్నారు.  అనంతరం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొండూరు,చీమన్ పల్లి,సిరికొండ గ్రామాలలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలో  పలు వివాహ కార్యక్రమాలకు  రూరల్ ఎమ్మెల్యే హాజరై, నూతన వధూవరులను  ఆశీర్వదించి, సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, డిసిసి కార్యదర్శి, యూత్ నాయకులు, సొసైటీ చైర్మన్లు,సొసైటీ డైరెక్టర్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Survey of encroached Shiva temple land to be conducted soon

More articles

Latest article