తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం షాక్

0 5,327

. . . బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ను కొట్టివేత

వెబ్ డెస్క్, బతుకమ్మ :

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వం జీవో 9ని జారీ చేసిన విషయం తెల్సిందే. దొంతి మాదవరెడ్డితో పాటు మరికొందరు ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టుకు సవాల్ చేయగా స్టే విధించిన విషయం తెల్సిందే. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ నెల 15న స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో గురువారం ఈ కేసుపై విచారణ జరిపి లీవ్ పిటిషన్ పై ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణను ప్రభుత్వం తరపున వాదించిన అభిషేక్ సింఘ్వి వాదనలను పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్లను మరోసారి గుర్తు చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. అవసరమైతే పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.