కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 10 సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు నిర్వహింస్తున్నారు.అందులో భాగంగా మంగళవారం రామారెడ్డిలో ఫుట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సమ్మర్ కోసం క్యాంపులో 34 బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జిల్లా యువజన మరియు క్రీడాల శాఖ అధికారి మాట్లాడుతూ ఈ క్యాంపును 14 సంవత్సరాల లోపు బాల బాలికలు ప్రతి ఒక్కరు సద్వినియోగం పరచుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి కి ఎదుగాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కె.ఎస్ జగన్నాథం, మండల స్పెషల్ ఆఫీసర్ సంజయ్ కుమార్, తహసిల్దార్ ఉమలత, ఎం.పీ.డీ.వో తిరుపతి రెడ్డి, ఎం.ఈ.ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామారెడ్డి, నిర్వాహకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
