24.1 C
Hyderabad
Monday, August 3, 2026

గుడ్డు బాధితుడి ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

  •  గోదావరిలోకి దూకేందుకు యత్నం
  • అధిక వడ్డీ  పేరుతో హవాలా దందాలో పెట్టుబడులు 
  • విచారణ జరుపుతున్న హైదరాబాద్ పోలీసులు 
  • కేసును పక్కదారి పట్టించేందుకే మిస్సింగ్ కేసులు 
  • ఐపీ పెట్టేందుకు ప్రయత్నాలు 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రూ.12 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన గుడ్డు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మధ్యవర్తులుగా ఉండి డబ్బులు పెట్టుబడి పెట్టిన ఓ యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. నగరానికి చెందిన సల్మాన్, సొహేల్ నిజామాబాద్ నగరంలోని బర్కత్ పురకు చెందిన గుడ్డుతో ఐదు సంవత్సరాలుగా దందా నిర్వహిస్తున్నారు. పలుమార్లు అతని అపార్ట్ మెంట్ వద్ద బోధన్  ప్రాంతంలోని నవీపేట్, జాన్కంపేట్ వివిధ ప్రాంతాల నుంచి ఇతరుల వద్ద సేకరించిన డబ్బులను గుడ్డుకు తీసుకువచ్చి ఇచ్చేవాడు. ఇద్దరి మధ్య ఇచ్చుపుచ్చుకోవడాలు బాగానే జరిగింది. కానీ గత నెలలో గుడ్డు కనిపించకుండాపోయే సరికి సల్మాన్ కు డబ్బులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరిగింది. ఆదివారం నాడు బోధన్ లోని చాందినీ దాబా వద్ద గొడవ జరిగింది. సల్మాన్ కు డబ్బులు ఇచ్చిన వారు తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో బాసర గోదావరిలోకి దూకేందుకు వెళ్లగా సొహేల్ అనే మధ్యవర్తి అతన్ని నిలువరించి అడ్డుకున్నాడు. సల్మాన్ దాాదాపు రూ.50లక్షల పై చిలుకు గుడ్డకు ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గుడ్డు తరపున బాధితులకు డబ్బులు చెల్లిస్తామని వాకల్తా  పుచ్చుకున్న చావూస్ చేతులెత్తేశారు. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ కు చెందిన ఓ నేత వద్ద గుడ్డు పంచాయితీ జరిగినా అందులో జోక్యం చేసుకోమని తేటతెల్లం చేసినట్లు తెలిసింది. గత నెలలో నిజామాబాద్ 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో గుడ్డు మిస్సింగ్ పై కేసు నమోదు అయిన అది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గుడ్డును హైదరాబాద్ లో ఉంచి ప్లాన్ ప్రకారమే మిస్సింగ్ గేమ్  ఆడుతున్నారన్న వాదనలున్నాయి. గత నెలలో గుడ్డును వెతికేందుకు కొందరు ఔరంగాబాద్ ప్రాంతంలో తిరిగినా ఆచూకీ దొరకలేదని తెలిసింది. నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇంటికి గుడ్డు రాకపోకలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా బాధితులు ఒక నజర్ వేసి  ఉంచారు. గుడ్డును కాపాడేందుకు ఐపీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు బాధితులకు తెలిసి లబోదిబోమంటున్నారు. గుడ్డు హైదరాబాద్ లోని  టోలిచౌక్ వరకే తనతో వచ్చే వారిని డబ్బులతో తీసుకెళ్లే వాడని అక్కడి నుంచి గచ్చీబౌలిలో గుర్తు తెలియని  వ్యక్తులకు డబ్బులు అందజేసి తిరిగి వచ్చేవాడని బాధితులు చెబుతున్నారు. అందరి వద్ద సేకరించిన డబ్బును హవాలా విషయంలో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. డబ్బులు రాబట్టుకునుందకు బాధితులు ఏకమౌతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్పొరేషన్ చైర్మన్ అన్న కొడుకు బామ్మర్ధి గుడ్డు కావడంతో అతడిని రక్షించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులు మాత్రం డబ్బుల కోసం ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మొన్నటి వరకు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన వారు చేతులెత్తేస్తుండడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.

More articles

Latest article