నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ భాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ కార్యాలయంలో అశోక్ బుదవారం ఉదయం దుర్గా ప్రసాద్ నుంచి భాధ్యతలను తీసుకున్నారు. అసీపాబాద్ నుంచి నిజామాబాద్ డిఇఓగా అశోక్ బదిలిపై రాగా నిజామాబాద్ డిఇఓ దుర్గా ప్రసాద్ ను మాడల్స్ స్కూల్ డిప్యూటి డైరెక్టర్ గా బదిలి చేసిన విషయం తెలిసిందే. నూతనంగా జిల్లా విద్యాశాఖాధికారిగా భాధ్యతలను స్వీకరించిన అశోక్ ను జిల్లా విద్యాశాఖా కార్యాలయం అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. డిఇఓ అశోక్ గతంలో నిజామాబాద్ డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా పని చేశారు.

