29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంఈఓ వెంకటేశం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు ఇష్టపడి చదవాలని ఎంఈఓ వెంకటేశం అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో ఆన్యువల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు గ్రేడింగ్ విధానం తొలగించడం జరిగిందని అన్నారు. అన్యువల్ ఎగ్జామ్స్ లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష జవాబు పత్రాలు లో బుక్ లెట్ విధానం అమలు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ గాంధీ ఉపాధ్యాయ బృందం ఎంఈఓ ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జహంగీర్, ఉపాధ్యాయులు ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్, బలవంతరావు, విద్యా, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Students should like to read

More articles

Latest article