27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ధర్నా

Must read

  • క్యాంపస్ చుట్టూ పోలీసుల బందోబస్తు
  • ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు

 

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలో బేసిక్ వద్ద ఉన్న  తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దక్షిణ ప్రాంగణం విద్యార్థులు సోమవారం ఉదయం ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్కడ  బైఠాయించారు విద్యార్థులు మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణంలో అంబులెన్స్ లేకపోవడం, ప్రహరీ గోడ లేకపోవడం, పలు సమస్యల  కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యలను పరిష్కరించి నాధుడే లేడని పరిష్కరించేంతవరకు తాము ఆందోళన విరమించమని పట్టుపట్టారు.

Students' protest to resolve issues

అంబులెన్స్ , క్రీడా ప్రాంగణం, ప్రహరీ గోడ లేదని సంవత్సరం నుంచి ప్రిన్సిపాల్ కు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నామని ఈరోజు వరకు సమస్యలు పరిష్కరించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దక్షిణ ప్రాంగణంలో అంబులెన్స్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు సుమారు 6 గంటల ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదుట బైఠాయించి సమస్యలు  పరిష్కరించాలన్నారు. ఈ విషయం తెలుసుకున్న రిజిస్టర్ యాదగిరి అక్కడి చేరుకొని విద్యార్థులను సముదాయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రిజిస్టార్ కు విద్యార్థులు వినతి పత్రం అందజేసి ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Students' protest to resolve issues

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article