27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడా రామాలయం నందు నూతన దేవాలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ కొన్ని రోజుల క్రితం చేపడుతున్న పనుల్లో భాగంగా పక్కన ఉన్న ఒక ప్రైవేటు వ్యక్తి అట్టి దేవాలయం మధ్యలో నుంచి దారి కావాలని లేనిపక్షంలో డబ్బులు ఇవ్వాలని దేవాలయం సభ్యులను కొద్దీ రోజులుగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో,అట్టి వివాదం స్థానిక శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  దృష్టికి బండ్లగూడా దేవాలయ కమిటీ సభ్యులు, బండ్లగూడా గ్రామ పెద్దలు తీసుకొచ్చారు.దానిలో భాగంగా ఈ రోజు సుధీర్ రెడ్డి గారు స్థానిక జీ.హెచ్.ఏం.సీ.అధికారులచే అట్టి ప్రాంతంలో పర్యటించారు.దానిలో భాగంగా అట్టి ప్రైవేటు వ్యక్తులు మాకు గుడి ఆవరణ నుంచి రోడ్డు ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన పత్రాలు అధికారులు పరిశీలించి ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న పత్రాలు నకిలీ అని తేల్చిచెప్పారు.గతంలో అట్టి దేవాలయం పక్కన ఉన్న రోడ్డు ఆక్రమించి నూతన ఇంటి నిర్మాణం చేపట్టి మరొకరికి విక్రయించడం జరిగింది అని దేవాలయం సభ్యులు ఆరోపించారు.అనంతరం అధికారులు పత్రాలు పరిశీలించి వారికి దేవాలయం ఆవరణలో నుంచి రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.దేవాలయం సభ్యులు నిర్బయంగా దేవాలయం నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పారు.మళ్ళీ దేవాలయం నిర్మాణ పనుల్లో ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే పక్కన ఉన్న రజక,కుమ్మర్ల స్మశానవాటిక దగ్గర దాదాపు వంద గజాల స్థలం ఇట్టి వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది.అందులో నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి కులగొట్టిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థలంలో నూతన నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అట్టి స్థలం కాపాడాలని కోరారు.అనంతరం సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు.వెంటనే అట్టి స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రామాలయం స్థలంలో నిర్మాణం చేపట్టుకోవచ్చని హామీ ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ వంశీకృష్ణ,టౌన్ ప్లానింగ్ అధికారి విజయలక్ష్మి,డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి,నాయకులు ఆనంతుల రాజిరెడ్డి,చెరుకు ప్రశాంత్ గౌడ్,జగదీశ్వర్,శంకరయ్య,యాదయ్య,సుదర్శన్,రాములు గౌడ్,రాజు గౌడ్,భవాని శంకర్,లక్ష్మయ్య గౌడ్,పాండు గౌడ్,శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.

We will not stand idly by if government land is occupied.

More articles

Latest article