27.3 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యార్థులంతా జాతీయవాదం వైపు నడవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ

 

డిచ్ పల్లి, బతుకమ్మ : ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.  ఈ దేశంలో ఉన్నపేద బడుగు బలహీన విద్యార్థుల కోసం నిరంతరం పనిచేస్తున్న జాతీయవాద విద్యార్థి సంఘం ఏబీవీపీ సభ్యత్వం తీసుకోని జాతీయ వాధం వైపు నడువాలని ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు శివ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిచ్పల్లి శాఖ ఆధ్వర్యంలో  సోమవారం ఎస్పిఆర్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా శివ మాట్లాడుతు…1949జులై 9 న ఐదుగురితో ప్రారంభమైన ఏబీవీపీ నేడు 55లక్షల మెంబర్షిప్ తో నిరంతరం దేశం కోసం విద్యార్థుల కోసం పనిచేస్తుందన్నారు.క్షణం క్షణం మా కణం కణం భరతమాతకు సమర్పణమంటూ భరతమాత సేవ కోసం నిరంతరం పనిచేస్తుంది  అని అన్నారు.విద్యార్థులంతా జాతీయ భావాలతో మరియు దేశం కోసం పని చేయాలని మరియు అలాగే దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ఏబీవీపీలో సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిచ్పల్లిలోని కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పెద్ద ఎత్తున మెంబర్షిప్ లొ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ సెక్రెటరీ సమీర్, తెలంగాణలోనిస్ట్ జాయింట్ సెక్రటరీలో లెనిన్, అనిల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నెహ్రు, రామకృష్ణ, హర్ష, నందన్ తదితరులు పాల్గొన్నారు.

All students should move towards nationalism

More articles

Latest article