- అసిస్టెంట్ ప్రొఫెసర్(సి)డా.పిట్ల సరిత
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచాన్ని మార్చే శక్తి యూనివర్సిటీ విద్యార్థులకే ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి) డా.పి.సరిత అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ లో పి డి ఎస్ యూ యూనివర్సిటీ మహాసభ గురువారం కంప్యూటర్ అండ్ సైన్స్ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా. పి.సరిత మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు ప్రగతిశీల భావాలతో ప్రతి విషయాన్ని అధ్యయనం చేయాలని, విశ్వవిద్యాయాలు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా మారాలని అన్నారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన శాస్త్రీయ విద్యను దూరం చేస్తున్నారని, ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని ప్రతి సమస్యపై అధ్యయనంతో పాటు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని, బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ, పీజీ కేంద్రాలుగా మారుస్తుందని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డిగ్రీ పిజీ కళాశాలలకు అటానమస్ లు ఇచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలకు వచ్చే ఆదాయాన్ని దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ అభివృద్ధికి అధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. తే.యూ పి డి ఎస్ యూ ప్రధాన కార్యదర్శి జయంతి బిగిపిడికిలి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, తే.యు పి డి ఎస్ యూ నాయకులు అక్షయ్, రవీందర్, గౌతం రాజ్, రాకేష్, నిఖిల్, దినేష్ కార్తీక్, నవ్య, ప్రవీణ, హుస్సేన్, వినీల్, సురేష్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.

