26.3 C
Hyderabad
Monday, August 3, 2026

చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

. . . గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ అన్నారు. ఆదివారం నగరంలోని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే మంచి విద్యను అభ్యసించాలని, అప్పుడే మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇతర కారణాలవల్ల విద్యను మధ్యలో ఆపివేయకూడదన్నారు. గౌడ కులస్తులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అసోసియేషన్ తోడుగా ఉంటుందన్నారు. విద్యార్థులు మాత్రం చదువుకు దూరం కావద్దన్నారు గౌడ కులస్తులకు సంబంధించి గౌడ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. విద్యార్థుల విద్య బోధనకు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామన్నారు. గౌడ ప్రజాప్రతినిధులు విద్యావంతులు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా గౌడ విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ప్రతిభ పురస్కారాలు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి విద్య సౌకర్యాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మారయ్య గౌడ్. పట్టణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, రవీందర్ గౌడ్, సోమ లింగం గౌడ్, రాజా గౌడ్, బోజగౌడ్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Students have a good future with education.

More articles

Latest article