నందిపేట్, బతుకమ్మ : రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకునందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న పోలపల్లి నందిత పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 7,వ తేది న ఇండియన్ మిషన్ స్కూల్ లో జరుగనున్న 58 వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకు ఎంపిక అయ్యింది. అక్టోబర్ 22 వ తేదీన కామరెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సెలెక్షన్స్ లో ఎంపిక అయ్యి. పిట్లం లో జరిగిన సన్నాహాక శిభిరంలో పాల్గొని ఈ రోజు రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరారు. ఈ సందర్బంగా స్కూల్ కరస్పాండెంట్ కానూరి గంగా సాగర్, డైరెక్టర్ కానూరి శోభ, ప్రధానోపాధ్యాయులు చెలిమెల గంగా భూషణ్,ఇంచార్జ్ వినోద్ కుమార్, పిఈటీ లు ముత్యం, సుమలత, లిఖిత లు అభినందించారు.
