29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలో రాణించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నవ్య భారతి పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ప్రాసెస్ సాయి హ్యాండ్ వాల్ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని నగరంలోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ అన్నారు. జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డిఎస్ఏ మైదానంలో ఉమ్మడి జిల్లాల అండర్ 17 జిల్లా స్థాయి పోటీలలో జిల్లా కేంద్రంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులు బాలుర విభాగములో అమన్ ఖురేషి , మనిత్, గౌతమ్, సుశాంత్, బాలికల విభాగం లో మహిత, వినిష , నాగవైష్ణవి, సహస్ర, శ్రీనిధి లు ఎంపికైనట్లు నవ భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ కరస్పాండెంట్ శ్రీదేవి లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో పోటీలో రాణించి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సైతం రానించి జాతీయస్థాయి కి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ఈ సాయికి ఎదగడానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు అజ్మత్ ఖాన్ ను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆంథోనీ, హెచ్ఆర్ డైరెక్టర్ లత వైస్ ప్రిన్సిపల్ సరిత సుధీర్ లు ఎంపికైన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

More articles

Latest article