. . . ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పాము కాటుకు గురైన సంఘటన నిజామాబాద్ నగరంలోని బోర్గాం ప్రైమరీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఒకటవ తరగతి విద్యార్థి దేవాన్ష్ ఎప్పటి లాగే పాఠశాలకు మంగళవారం వెళ్లాడు. ఉదయం 12 గంటల ప్రాంతం లో సదరు విద్యార్థి కాలకృత్యాలకు వెళ్లే సమయంలో ఏదో విష కీటకం విద్యార్థికి కాటు వేసినట్లు సమాచారం. తీవ్రమైన నొప్పి రావడం తో సదరు విద్యార్థి బాధపడడంతో వెంటనే పాఠశాలలోని సదరు ఉపాధ్యాయుడు గమనించి చికిత్స నిమిత్తం దేవాన్ష్ ని తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆసుపత్రిలో వైద్యుడు బాలుడికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
. . . మరుగుదొడ్ల చుట్టూ పిచ్చి మొక్కలు
బోర్గాం ప్రైమరీ పాఠ శాలలో మరుగుదొడ్లు చుట్టూ ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో గడ్డి పెరగడంతో విష కీటకాలకు నిలయంగా మారింది. పూర్తిగా పాఠశాలలో చదివే విద్యార్థులకు భద్రత కరువైంది. గతంలో కూడా పలుమార్లు పాము వచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు విద్యార్థుల భద్రతపై ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాకుండా పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ కూడా మొక్కుబ డిగానే మమ అనిపిస్తున్నారు. మెనూ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా తీరు మారలేదు. పూర్తి స్థాయిలో మెనూ పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు అన్ని సౌకర్యాలు అందుతాయని నమ్మకాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కల్పించేలా ప్రైమరీ పాఠశాల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

