బోధన్, బతుకమ్మ :
బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఆరుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. బెల్లల్ గ్రామం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఈర్నాల హనుమన్లు, జి.రాములు, గణపతి, అలాగే తట్టి కోట్‌కు చెందిన ఇ.పోశెట్టి ఇరువర్గాలుగా గొడవపడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి నలుగురికి వారం రోజుల జైలు శిక్ష విధించారు. ఇదే సమయంలో బోధన్ బైపాస్ రోడ్డుపై పంట పొలాల్లో మద్యం సేవిస్తున్న పవన్ కళ్యాణ్, గంగాసాగర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారికి ఒక రోజు జైలు శిక్ష విధింపజేశారని సీఐ వెంకటనారాయణ తెలిపారు.
