24 C
Hyderabad
Sunday, August 2, 2026

స్త్రీ నిధి రీపేమేంట్ విధానంపై శిక్షణ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

స్త్రీ నిధి డబ్బులు పి ఓ ఎస్ మిషన్ ద్వారా స్త్రీ నిధి రీపేమెంట్ చేసే విధానం పై సోమవారం వేల్పూర్ మండల కేంద్రంలోని ఐకెపిలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్త్రీ నిధిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా మిస్ యూస్ కాకుండా పూర్తి పారదర్శకతతో రీపేమెంట్ జరిగించడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని రీజినల్ మేనేజర్ రామ్ దాస్ అన్నారు. ప్రస్తుతం కోరిన డిజిటల్ విధానాన్ని అనుసరిస్తూ స్త్రీ నిధి ముందడుగు వేస్తూ ఈ విధానాన్ని రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివో ఏలకు పిఓఎస్ మిషిన్లను అందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం, స్త్రీ నిది మేనేజర్ మురళి, ఆరు మండలాల స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్లు రేణుక, సరస్వతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article