. . . నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లాల రమేష్ పై జరిగిన దాడి గురించి డీసీసీ అధ్యక్షులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అక్రమ వసూళ్లను బయటపెట్టినందుకు కిరాయి మూకలను ఉపయోగించి బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల ముందుకు నిజాలను తీసుకువస్తే, వాటికి సమాధానం చెప్పలేక భయపడి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారని, జిల్లాల రమేష్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానం మాత్రమే కాకుండా, ప్రజల హక్కులపై నేరుగా దాడి చేయడమని వాపోయారు. ఇలాంటి దాడులు చూస్తూ ఊరుకోమని, రమేష్ పై దాడి చేయడం కచ్చితంగా కుట్రలో భాగమే అని అన్నారు. ఈ దాడిలో సరైన నిజాలు బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. ఎనిమిదవ డివిజన్ బిజెపి కార్పొరేటర్ పై రెండు రోజుల క్రితం కేసు నమోదైన విషయం మరుగున పడకముందే అదే డివిజన్ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రమేష్ పై దాడి జరగడం కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా లోతుగా పరిశీలన చేసి ఇలాంటి తప్పుడు కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. విమర్శలను స్వీకరించి సమాధానం ఇవ్వాల్సింది పోయి, దాడులు చేయించడం చాలా బాధాకరమని, ఈ విధమైన బెదిరింపులు, దౌర్జన్యాలు ఎంత చేసినా నిజం దాచలేరన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
