29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట ఆడితే కఠిన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ దాడుల్లో పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పేకాట, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరకైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712686133 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.

More articles

Latest article