28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కానిస్టేబుల్ పై దాడి సిగ్గుచేటు చర్య

Must read

📰 Generate e-Paper Clip

  • దళిత సంఘాల అధ్యక్షులు గడాల ప్రసాద్

 

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి సిగ్గుచేటు చర్య అని ఆ ఘటనను తీవ్రంగా భీమ్ గల్ మండల దళిత సంఘాల అధ్యక్షులు గడాల ప్రసాద్ ఖండించారు. ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు కత్తితో పొడిచి పారిపోతుంటే, కానిస్టేబుల్ రక్తంలో కొట్టుమిట్టడుతుంటే అక్కడ గుమ్మిగుడిన ప్రజలు చూస్తూ మొబైల్ లో వీడియో తీయడం యావత్ సమాజం తలదించుకొనే చర్యగా ఆయన అభివర్ణించారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కు తరలించాలన్న ఆలోచన లేకపోవడం మానవత్వం లేని చర్య అన్నారు.ప్రజల రక్షణ కోసం పని చేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ ను హాస్పిటలకు తరలించి ఉంటే బ్రతికి ఉండేవాడేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

More articles

Latest article