- మొక్కజొన్న, సోయ పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా
కమ్మర్ పల్లి, బతుకమ్మ : ప్రభుత్వం మొక్కజొన్న,సోయ పంటల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి మద్దత్తు ధర తో మొక్కజొన్న,సోయపంటను కొనుగోలు చేయాలని, యాసంగి పంటకు సంబంధించిన వరి పంట బోనస్ ను వెంటనే వెయ్యాలని డిమాండ్ చేస్తూ కమ్మర్ పల్లి మండల రైతులు ఆదివారం రోడేక్కారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుకపోవడం వల్ల తాము కష్టపడి పండించిన పంటలను తుట్టికి పావుశేరు అమ్ముకొని నష్టపోతున్నామని జాతీయ రహదారి పై రాస్తారోఖో చేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మొక్కజొన్న, సోయ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యాసంగి పంటకు సంబంధించిన వరిపంట బోనస్ ను రైతుల ఖాతాల్లో వెంటనే వెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమం లో రైతులు యాల్ల గణపతి, అవరి సతీష్, డబ్బ భూమన్న, బద్దం సురేష్, కొమ్ముల నవీన్, బజారు రమేష్, బద్దం రమేష్, రేగుంట దేవేందర్, బద్దం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
