28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పశువుల కళేబరాల నిల్వ.. ఇబ్బందుల్లో స్థానికులు

Must read

📰 Generate e-Paper Clip

  • అనుమతులు లేకుండా నిల్వ చేస్తున్న వైనం
  • పలు సమస్యలు ఎదుర్కొంటున్న స్థానికులు, రైతులు
  • స్పందించని సంబంధిత అధికారులు

 

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని  బోధన్, సాలూరా బైపాస్ రోడ్డు ప్రక్కన ఉద్మీర్ కాలనీ సమీపంలో కొందరు షెడ్డు లు నిర్మాణాలు చేసి అందులో పశువుల కళేబరాల వ్యర్థాలను నిల్వ చెయ్యడంతో స్థానికంగా వుండే ప్రజలు, ప్రయాణికులు, రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ దుర్గంధపు వాతావరణం వల్ల స్థానిక ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రి పాలవుతున్నామని స్థానికులు తెలిపారు. సమీపంలో వుండే కాలనిలోకి కుక్కలు ఈ వ్యర్థాలను తీసుకొని వచ్చి పడివెయ్యడం, పక్కన ఉన్న పంట పొలాలలో పని చేయడానికి కూలీలు సైతం విముఖత చూపడంతో రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రైతులపై కూడా కుక్కలు దాడి చేస్తున్నని అన్నారు. ఒకవేళ వ్యవసాయ కూలీలు వచ్చిన అధిక కూలి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ దుర్వాసన వల్ల ఈ రహదారి వైపు ప్రయాణించే ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇకనైనా సంబంధిత  అధికారులు తక్షణమే ఈ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు.

Storage of cattle carcasses

More articles

Latest article