28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఏర్గట్ల మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. అలాగే బీంనగర్ లో గల పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్నులు, పెన్సిల్ లు, శార్పనర్లు, ఏరేసర్లను ఏర్గట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు (తొర్తి) దానం గంగ మోహన్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, మంచి మనసున్న యువ నాయకుడని, అతను ఎంతో పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో గల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు. అలాగే స్కూల్లో చదివే విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని తమ పిల్లలను, ఎంతో ఇష్టంతో చదువులు చదివిస్తున్న తల్లి తండ్రులకు మంచి పేరు తేవాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన ఉపాధ్యక్షులు సుమన్ గౌడ్, తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద భూమేష్, ఏర్గట్ల మండల యువజన నాయకులు దండవోయిన సాయి, సాగర్, గణేష్, శైలేష్, సంజీవ్, మెరుగు మహేష్, మండల యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article