ఏర్గట్ల, బతుకమ్మ :
మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నూతనంగా నిర్మించే మూత్రశాలల నిర్మాణ కార్యక్రమాన్ని ఏర్గట్ల సర్పంచ్ కొలి ప్యాక ఉపేంధర్ రెడ్డి మంగళవారం కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధుల నుండి రూ.16 లక్షలు మంజూరు కావడం తో మూత్రశాలల నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి, శ్రీనివాస్, గ్రామకమిటీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణచారి, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు తోకల వంశీ, కారు పాకల నవీన్, మన్నన్, కూరాకుల సాయన్న, కొప్పెర హనుమాడ్లు, రాజారపు లక్ష్మి నరసయ్య, గుండ విఠల్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
