27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ లో స్తబ్దత

Must read

📰 Generate e-Paper Clip

  • స్థానిక సంస్థల ఎన్నికల వరకు పదవుల పందేరం లేనట్టేనా..?
  • పార్టీ పదవులు… అధికారిక పదవుల బర్తీకి బ్రేక్
  • నిరాశలో కాంగ్రెస్  క్యాడర్

 

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఇరవై నెలలు గడిచాయి. పదవులు వచ్చిన వారు ఎంజాయ్ చేస్తుండగా లీడర్లను నమ్మిన క్యాడర్ కు ఇవిగో ఇస్తున్నాం.. అవిగో తీసుకోండి.. అంటు కాలం బుచ్చారు నాయకులు. నిన్న మొన్నటి వరకు మంత్రి వర్గ కూర్పు పేరిట పార్టీ పదవులు, అధికార పదవుల బర్తీని నిర్లక్ష్యం చేశారు లీడర్లు. తీరా మంత్రి వర్గ విస్తరణ రెండవ విడత జరిగిన ఉమ్మడి జిల్లా కు మరోసారి మెండిచేయి దక్కింది. దానితో లీడర్లు బేజారు అయ్యారు. క్యాడర్ ను పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పుడు అంతా స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు సిద్ధపడుతుండగా, ద్వితీయ శ్రేణి నాయకులు నిరాశలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు ఆలయాలకు పాలకవర్గాల నియమాక ఉత్తర్వులు రాగా అందులో వలస వచ్చిన వారికి పదవులు ధక్కడంతో వివాదం ఏర్పడి పోలీస్ స్టేషన్ మెట్ల వరకు పంచాయితీ సాగిన విషయం విధితమే. ఈ వ్యవహరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రాజీనామాకు యత్నించడం కలకలం రేపింది.

ఇటీవల న్యాయ స్థానం సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తీర్పు చెప్పింది. బిసి రిజర్వేషన్ లను లోకల్ బాడి ఎన్నికలలో అమలు చేయాలని తలంపుతో కాంగ్రెస్ అధినాయకత్వం పాటు పడుతుంది. గవర్నర్  అమోదానికి బిసి బిల్లు పంపగా, కేంద్రం కొర్రిలు పేడుతుండగా బిసీ రిజర్వేషన్ ల అమలుకు కేంద్రంతో పోరుక లేక అర్డినెన్స్ తెద్దామా అనే డైలామాలో ఉంది రాష్ట్ర సర్కార్. కాని స్థానిక సంస్థల ఎన్నికలలో ముందుగా గ్రామ పంచాయతీ, మండలపరిషత్ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సమాయాత్తం అవుతుంది. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గం ఇంచార్జుల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ జోరుగా సాగుతుంది. ఉచిత బస్ ప్రయాణికుల విషయంలో 200 కోట్ల  మహాలక్ష్మి పథకం సంబరాలు చేశారు. తాజాగా భూ భారతి పట్టాల పంపిణి జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వేగంగా సాగుతుండటం విశేషం. ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రధాన ఆరు హామీలు అమలు చేస్తున్నామని దానిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేసేందుకు కార్యకర్తలు కరువయ్యారు. మొన్నటి వరకు మంత్రి వర్గ విస్థరణను బూచిగా చూపించిన నాయకత్వం, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తరువాతనే పదవుల పందేరం అని చూచాయగా తెలుపడంతో క్యాడర్ లో అసంత్రుప్తి మొదలైంది.

జిల్లాలో పార్టీ పదవులతో పాటు ఇతర పదవుల నియామకాల కోసం ఇంటర్వ్యులు, దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ పరిశీలకులతో పాటు జిల్లా ఇంచార్జీలకు కాంగ్రెస్ నేతలు తమ గోడును వెల్లబోసుకున్నారు. దరఖాస్తులు, ఇంటర్వ్యూలు ఇచ్చాము ఇక పదవుల పంపకం అనే సమయంలో లోకల్ బాడి ఎన్నికల వరకు బర్తీ ఉండదని స్థానిక నాయకులు చెప్పడంతో పార్టీ నాయకులలో నిస్తేజం నిండింది. దాదాపు పది సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఏర్పడిందని  తమకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డ వారికి పదవుల కేటాయింపు కాలాతీతం అవుతుండటం తమ బాధను ఎవ్వరికి చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో నుడా డైరెక్టర్  పదవులతో పాటు పలు ఆలయాలకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. అంతే గాకుండా జిల్లా, నగర కాంగ్రెస్ పదవులలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నవారికి నామినేటేడ్ కార్పొరేషన్ పదవులు దక్కడంతో వారిస్థానంలో కొత్తవారిని నియామకాలు జరుగాల్సి ఉంది. ఈ విషయంలో కసరత్తు జరిపిన పీసీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గడువు ముంచుకొస్తుండటంతో పదవుల పంపకాలకు బ్రేక్ ఇచ్చింది. సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసీ టిక్కెట్లు ఆశీస్తున్న వారు ఇప్పుడే పైరవీలు షురూ చేయగా స్థానిక సంస్థలు లేని చోట లీడర్లు మాత్రం నాయకుల తీరుపై గుర్రుగా ఉన్నారు. మున్సిపల్ కార్పోరేషన్, మున్సిపాల్టీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉండగా పార్టీ పదవులు, ఇతర డైరెక్టర్ పావులు, కార్పోరేషన్ల పదవులను ఆశిస్తున్న వారు మాత్రం సైలెంట్ అయ్యారు. దాదాపు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన తమకు పదవులు వస్తాయో రావో అనే బెంగపట్టుకుంది. మళ్లీ ఎక్కడ ఫలితాలు తారుమారు ఐన తమ పరిస్థితి ఏమిటని సెకండ్ గ్రేడ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలలో అయోమయం నెలకొంది.

More articles

Latest article