నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్‌లోని మాధవనగర్ లోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ విశిష్ట ఫలితం మా పాఠశాల యొక్క నిబద్ధత, శ్రద్ధ, విద్యా ప్రమాణాలపై ఉన్న అంకితభావానికి నిదర్శనమని వారన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించేందుకు గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్, CEO, డైరెక్టర్, ప్రిన్సిపల్ విద్యార్థులను అభినందించి, వారి ప్రతిభను ప్రశంసించారు. రయాన్ మహ్మద్ అన్సార్ – 461/500, ఖవైష్ శర్మ – 446/500, తనయ నలే – 444/500, ఆకారం విహాన్ – 444/500, భవాని నందిత – 441/500, గజాలే చరణ్ – 440/500, బస్వచేతన్ జుబ్రే – 439/500, చందా హర్షిత్ – 437/500, మెడికొండ సలోమి – 436/500, సుబియా ఇరామ్ – 433/500, జరుపుల కార్తికేయ పావర్ – 422/500 మార్కులు సాధించినట్టు వారు తెలిపారు. ఇంతటి అద్భుత విజయాన్ని సాధించిన విద్యార్థులందరికి అభినందనలు తెలుపుతూ, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రిన్సిపాల్ కోరారు.

