వేల్పూర్, బతుకమ్మ :
వేల్పూర్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో గ్రామ సమన్వయకర్తలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం బత్తుల మాణిక్యం మాట్లాడుతూ ఎంటర్ ప్రైజేస్ ఏర్పాటు చేసే జీవనోపాదులకు ఇకనుండి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ అయిన ఉద్యమ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా సిసి వెన్నెమురళి మాట్లాడుతూ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసుకున్న మహిళల యొక్క సంవత్సరం ఆదాయం, టర్నోవర్ వంటి వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని శిక్షణ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు సరోజ కోశాధికారి విజయలక్ష్మి సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.
