సీబీఎస్ఈ ఫలితాలలో ఎస్ఎస్ఆర్ ప్రతిభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లోని మాధవనగర్ లోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ విశిష్ట ఫలితం మా పాఠశాల యొక్క నిబద్ధత, శ్రద్ధ, విద్యా ప్రమాణాలపై ఉన్న అంకితభావానికి నిదర్శనమని వారన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించేందుకు గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్, CEO, డైరెక్టర్, ప్రిన్సిపల్ విద్యార్థులను అభినందించి,...