24 C
Hyderabad
Sunday, August 2, 2026

మీ సేవా కేంద్రాలు దళారులకు అడ్డాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సేవాల పేరిట అదనపు వసూళ్లు

 

. . . అనాధికార వ్యక్తుల నిర్వహణలో మీ సేవా కేంద్రాలు

 

. . . ఖాళీ నోటరిలు . . . రికార్డులు లేకుండా స్టాంప్ పేపర్ల విక్రయాలు

 

. . . ఇతర మీ సేవా కేంద్రాల  సర్టిఫికేట్ల జారీలు

 

. . .  అల్వాల్ మీసేవా కేంద్ర నిర్వహకులపై క్రిమినల్ కేసు

 

. . . ఖాళీ సర్టిపికేట్లపై సంతాకాలు చేసిన అధికారుల

 

. . . ఎసిబి ఆకస్మీక తనిఖీలలో వెల్లడైన మీ సేవ కేంద్రాల నిర్వహకుల లీలలు

 

. . . మీ సేవా కేంద్రాల నిర్వహకులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ సిపారసు

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

తెలంగాణ వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు దళారుల అడ్డాలుగా మారాయి. అదనంగా ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము కంటే ఎక్కువ సోమ్ము వసూళ్లు జరుగుతుంది. మీ సేవ కేంద్రాలు కోందరు అనాధికార వ్యక్తుల చేతిలో నడుస్తున్నాయి. చాల మీ సేవా కేంద్రాలలో నోటరిలు, అటెస్ట్ చేయబడిన బాండ్ పేపర్లు, సర్టిఫీకేట్ లు గుర్తించబడ్డాయి. రికార్డులు లేకుండా బాండ్ పేపర్ల విక్రయం జరగుతుంది. ఓక మీ సేవా కేంద్రం సర్టిఫీకేట్లు మరో మీ సేవా కేంద్రాలలో జరుగుతున్నాయి. రెవిన్యూ అధికారులు జారీ చేసిన సర్టిఫీకేట్లు దరాఖాస్తు దారులకు ఇవ్వకుండా దాచి పెట్టి ఉంచారు అని ఎసిబి అకస్మీక తనిఖీలలో గుర్తించింది. దాని ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని సిపారసు చేసింది…

 

Your service centers are a barrier to middlemen.

 

తెలంగాణ వ్యాప్తంగా 13 జిల్లాలో అవినీతి నిరోదక శాఖ మీ సేవా కేంద్రాలపై అకస్మీక దాడులతో హడలేత్తించింది. బుదవారం రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాలలో తనీఖీలను నిర్వహించిన వివరాలను ఎసిబి జాయింట్ డైరెక్టర్ పత్రిక ప్రకటన విడుధల చేశారు. అంబర్ పేట్ ( హైద్రాబాద్), ఖైరతాబాద్, అల్వాల్, మల్లేపల్లి, తార్నాక సర్కిల్, సరూర్ నగర్( హైద్రబాద్) లతో పాటు మంచిర్యాల, ఖమ్మం, మహ భూబ్ నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లా కేంద్రాలలో తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. ఆల్వాల్ లోని ప్రభుత్వ మీ సేవా కేంద్రంలో అటెస్ట్ చేసిన ఖాళీ  క్యాస్ట్ సర్టిపికేట్లు,  ఓబిసీ, అపిడవిట్ లు, క్రిమిలేయర్, ఖాళీగా ఉన్న నోటరి స్టాంప్ పేపర్లు గుర్తించారు. వాటి ద్వార ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్టిపీకేట్ల జారీ విషయంను గుర్తించి ఆల్వాల్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా క్రిమినల్ కేసును నమోదు చేశారు. చాల మీ సేవా కేంద్రాలలో అనాధికార యూపిఏ చెల్లింపులను గుర్తించారు. వాట్సప్ ల ద్వార దళారులు, మీ సేవా కేంద్రాల నిర్వహకుల మద్య జరిగిన చాటింగ్ ను సీజ్ చేశారు.  రంగారెడ్డి జిల్లా సరుర్ నగర్ తిరుమల మీ సేవా కేంద్రంలో సంతాకాలు చేయని నోటరిలు, అటెస్టు చేయబడిన నాన్ జ్యూడిషియల్ బాండ్ పేపర్స్, అటెస్ట్ చేయబడిన ఖాళీ ఆదాయ ద్రువికరణ పత్రాలు స్వాధినం చేసుకున్నారు. చాల మీ సేవా కేంద్రాలలో ప్రభుత్వం నిర్ధేశించిన రూసుము కంటే అధనంగా వసూళ్లు చేస్తున్నట్టు గుర్తించారు. ఖమ్మం మీ సేవా కేంద్రంలో ఆనాధిర వ్యక్తులు మీ సేవా కేంద్రం నిర్వహిస్తు, సంతాకాలు చేస్తు సర్టిఫీకేట్లు జారీ చేస్తున్నట్టు తనిఖీలలో తెలింది. తార్నకలోని శ్రీ సాయి కమ్యూనికేషన్ కేంద్రంలో అనాధికారికంగా వసూళ్లు, నోటరి పేరిట జరుగుతున్నట్టు తెల్చారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ వద్ధ ఉన్న సంగమేశ్వర కమ్యూనికేషన్ లో రిజిస్టర్ స్టాంప్ పేపర్ ల విక్రయాలు అనాధికారికంగా ఎలాంటి రికార్డులు లేకుండా జరుగుతున్నట్లు గుర్తించారు. సూర్యపేట మున్సిపల్ కాంప్లెక్స్ లోని శ్రీసాయి వాసవి కంప్యూటర్ లో బాండ్ ల జారీ, సర్టిపికేట్లను జారీ చేయకుండా నిల్వ ఉంచినట్లు తనిఖీలలో తెలింది.

More articles

Latest article