హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్ సీ ఈఆర్ టీ ద్వారా ఫలితాలను ఈ నెల 29 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నెల రోజుల పాటు పదవ తరగతి పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు కావడం విశేషం. పదవ తరగతి పరీక్ష ఫలితాలు కావాల్సిన వారు వాట్సాప్ లో 8096958096 నంబర్ కు ఎస్సెస్సీ రిజల్ట్స్ అని మెస్సెజ్ చేస్తే ఫలితాలు వెల్లడించేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల సందర్భంగా పలు జిల్లాలో పేపర్ లీక్ లాంటి ఘటనలు చోటు చేసుకోగా పలువురి ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది.
