రేపు ఎస్సెస్సీ ఫలితాలు విడుదల
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్ సీ ఈఆర్ టీ ద్వారా ఫలితాలను ఈ నెల 29 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నెల రోజుల పాటు పదవ తరగతి పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు...