బతుకమ్మ,ఏర్గట్ల; గుమ్మి ర్యాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ రాజేశ్వర్ తండ్రి సోమ మస్కట్ గంగారెడ్డి ఇటీవలే స్వర్గస్తులయ్యారు. ఇట్టి విషయాన్ని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం తో,శుక్రవారం రోజు సోమరాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తాళ్ల రాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, క్యాతం సుభాష్ రెడ్డి, దేవన్న యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, గడ్డంరమేష్, బద్దం ప్రభాకర్,బద్దం హనుమాడ్లు,రోక్కెడ మోహన్,ఏలేటి బాలకిషన్, జైనుద్దీన్ లు పాల్గొన్నారు.