. . . సిద్దులగుట్ట పుణ్య క్షేత్రంలో రాములోరి కల్యాణానికి హాజరైన జీవన్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఆయా ఆలయాలలో వేద పండితులు సీతారామ కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

ఆర్మూర్ లోని రామాలయంతో పాటు సిద్దుల గుట్ట పుణ్య క్షేత్రంలో జరిగిన ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు జీవన్ రెడ్డి ను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
