29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని తెలంగాణ ఆంధ్ర డీజీఎం గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇంటర్ ఫలితాలు రెండో సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ లో రాష్ట్ర స్థాయి మార్కులు 993 బి వైష్ణవి, 992 తహుర ఫాతిమా, 990 హన్సిక, ఈ విధంగా 980 ఆపై మార్కులతో 127 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను  ఏ హర్షిని, ఎన్ దినేష్, సుప్పల శ్రీజ, శ్రీనిధి రెడ్డి 468 మార్కులు సాధించారు, అదేవిధంగా కే సంజన, మునిగంటి హరిణి, గుజ్జ రాజశ్రీ, దేశెట్టి వర్షిత్, గాండ్ల అఖిలేష్, హిమశ్రీ 467 మార్కులు సాధించారు. ఈ విధంగా 460 కి పైగా 91 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులను సాధించారని, విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని తెలంగాణ, ఆంధ్ర డీజిఎం గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభ కనబరుచుటకు విద్యార్థులలో ఉన్న ప్రతిభను సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయడం జరిగిందని, దానివల్లనే ఇంతటి చక్కటి ఫలితాలను సాధించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

More articles

Latest article