ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని తెలంగాణ ఆంధ్ర డీజీఎం గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇంటర్ ఫలితాలు రెండో సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ లో రాష్ట్ర స్థాయి మార్కులు 993 బి వైష్ణవి, 992 తహుర ఫాతిమా, 990 హన్సిక, ఈ విధంగా 980 ఆపై మార్కులతో 127 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఏ హర్షిని, ఎన్ దినేష్, సుప్పల శ్రీజ,...