25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంటర్మీడియట్ ఫలితాలలో నారాయణ నిజామాబాద్ విజయభేరి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంగళవారం ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్-2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ కి చెందిన గాండ్ల వరుణ్ జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు, జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు 438 మార్కులు, సీనియర్  ఇంటర్ విభాగంలో 1000 మార్కులకు 993 మార్కులు సాధించి నిజామాబాదు జిల్లాలో మొదటి స్థానంలో  నిలవడం అనేది నిజామాబాద్ జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు.  అలాగే సిద్ది ట్యాంక్ 465, పి. విరాజ్ 465, వి. కార్తీక 465, ఓం సాయి మహంత 463, సింధు హర్షిని 463,:డి. రవితేజ 463, ఎమ్. శ్రీయ 461, కే. సంజన 461 వంటి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగంలో అయెష ఆఫీఫా 438, సద్ది అక్షిత 432, నాశ్రా 427, అతీబ్ పర్వేజ్ 427 వంటి రాష్ట్ర స్థాయి మార్కులతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని తెలిపారు. సీనియర్ ఇంటర్ విభాగంలో అంబటి షర్వాణి 993, లవంగ వైష్ణవి 990, మాధవి నాగ శ్రావ్య 988, కె. సాత్విక్ 987, బండి శ్రాగ్వి 983, పి.రియా 982,  డి. హేమలత 982 జిల్లాలో అత్యధిక మార్కులు వరుసగా రెండవ సంవత్సరం నారాయణ కాలేజ్ విద్యార్థులు విజయ పదంలో నిలిచారని పేర్కొన్నారు.  ఇంటర్ విద్యతో పాటు జెఈఈ,ఎంసెట్,ఐఐటి,నీట్ లాంటి ఏ పోటీపరీక్షలైనా నారాయణ కళాశాల నిజామాబాద్ జిల్లాకి గర్వకారణంగా నిలిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్, ఏవో ఎం శేఖర్, నారాయణ విద్యాసంస్థల జిఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, కోర్ డీన్ వీరాంజనేయ ప్రసాద్ గారు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Narayana Nizamabad wins in intermediate results

More articles

Latest article