26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తె.యూలో అంబరాన్ని అంటిన  సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సాంస్కృత, క్రీడా దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వార్షిక దినోత్సవ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారత కబడ్డీ టీం  ప్రధాన కోచ్ డా. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము క్రీడలకు అధిక బడ్జెట్ను కేటాయించడంతోపాటు క్రీడా  విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం స్వాగతించాలని  పేర్కొన్నారు.  విద్యార్థులు క్రీడల్లో రాణించి  మానసిక ఉల్లాసంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ  ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చును అన్నారు.  వైస్- ఛాన్స్లర్  ఆచార్య టి. యాదగిరిరావు  ప్రసంగిస్తూ  తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యతోపాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్ని అంటున్నాయని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ  గ్రామీణ విశ్వవిద్యాలయాలలో అత్యంత ప్రతిభగల విద్యార్థులు ఉన్నారని  వారు ఇక్కడి వనరులను వినియోగించుకొని అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయానికి గుర్తింపు తెవాలన్నారు.  ప్రిన్సిపల్  ప్రవీన్ మామిడాల మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఆచార్య కే లావణ్య   డైరెక్టర్ కల్చరల్ అండ్ యూత్  సెల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు.  డాక్టర్ జి బాలకిషన్  డైరెక్టర్ స్పోర్ట్స్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నుండి అనేకమంది విద్యార్థులు జాతీయస్థాయిలో పాల్గొనడం విశ్వవిద్యాలయానికి గర్వకారణం అన్నారు.  అనంతరం  విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక  , ఉపన్యాస, పాటల, డాన్స్, క్విజ్  పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు   అతిధుల నుండి  బహుమతి అందుకున్నారు.  ఈ కార్యక్రమంలో  ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ఆచార్య కే సంపత్ కుమార్, ఎన్ఎస్ఎస్  డైరెక్టర్ ఆచార్య కే రవీందర్ రెడ్డి, ఆచార్య కనకయ్య, ఆచార్య అరతి, ఆచార్య వాసం చంద్రశేఖర్, బోయపాటి శిరీష,  లక్ష్మణ చక్రవర్తి, మహేందర్ రెడ్డి,ప్రసన్న శీల, డాక్టర్ సమత, ఆచార్య విద్యావర్ధిని, డైరెక్టర్  పిఆర్ఓ డాక్టర్ ఏ పున్నయ్య, డైరెక్టర్ యు జి సి  సిహెచ్ ఆంజనేయులు, డాక్టర్ నాగరాజు,  ఏఈ వినోద్, సాయి గౌడ్, భాస్కర్, విజయలక్ష్మి తదితర బోధన బోధ నేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు,  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Celebrations that lit up the air in the U.S.

More articles

Latest article