25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

​పది ఫలితాలలో ఎస్.ఆర్ విద్యార్థుల ప్రభంజనం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

​నగరంలోని రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన SSC ఫలితాలలో నిజామాబాద్‌లోని ఎస్.ఆర్ విద్యాసంస్థలు అత్యుత్తమ ఫలితాలను కనబరిచాయి. ఎస్.ఆర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బి సాయిశ్రీ 584/600, కె పవిత్ర 580/600, యం ప్రణతి రెడ్డి 579/600, సి.హెచ్ విష్ణు తేజ 579/600, యం.జెస్సింత 569/600 అత్యధిక మార్కులు సాధించారు. అలాగే ఇద్దరు విద్యార్థులు 580 కి పైగా, 10 మంది విద్యార్థులు 570 కి పైగా, 17 మంది విద్యార్థులు 560 పైగా, 37 మంది విద్యార్థులు 550 కి పైగా, 201 మంది విద్యార్థులు 500 కి పైగా మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ​పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులను ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డిలు, జోనల్ ఇంచార్జి ప్రణీత్ కుమార్, ప్రిన్సిపాల్స్ ఇషాక్ అహ్మద్, సరళ, మేరి, విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.

 

SR students excel in the 10th results

More articles

Latest article