నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్‌లో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ డైరెక్టర్ జయ సింహా గౌడ్, ప్రిన్సిపాల్ మంజు ప్రదీప్ పాల్గొన్నారు.
