28.9 C
Hyderabad

నవదుర్గ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

లక్ష్మీ వారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ నవదుర్గ మాత ఆలయంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి ఈశ్వరి – సుమన్ కుమార్ దివ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులు, ఉద్యోగులు, ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో వచ్చిన వారికి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి నెత్తికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, పద్మ, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, కార్యదర్శి మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, గురుచరణ్, స్వామి, విజయలక్ష్మి, మంగమ్మ, గీతారెడ్డి, శరణ్య, టీఎన్‌జీవో ముఖ్య సలహాదారు వనమాల సుధాకర్‌తో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, జిల్లా ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article