నవదుర్గ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : లక్ష్మీ వారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ నవదుర్గ మాత ఆలయంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి ఈశ్వరి - సుమన్ కుమార్ దివ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులు, ఉద్యోగులు, ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో వచ్చిన వారికి ప్రసాద వితరణ చేశారు....