28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇంటర్ ఫలితాల పై సమీక్ష లో ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవి కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్ లలో సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. 202526 విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల పై ఆయన బుధవారం ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ లతో ఇంటర్ విద్య కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫెయిల్ విద్యార్థులతో వెంటనే పరీక్ష ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫలితాల సమీక్షలో ఆయన మాట్లాడుతూ తక్కువ ఫలితాలు సాధించిన కళాశాలల ప్రిన్సిపాల్ లు తగిన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కళాశాలలు తిరిగి తెరిచేలోగా అన్ని సివిల్ పనులు పూర్తి చేయించాక నిధుల వినియోగం పై యుటిలైజేషన్ సర్టిఫికేట్ లు అందజేయాలని ప్రిన్సిపాల్ లకు సూచించారు. విద్యుత్ వైరింగ్, ఇతర ఫిట్టింగ్ లు, అన్ని మరమ్మతులు కళాశాలలు తెరిచేలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

More articles

Latest article