నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ లోని గాజుల పేట్ లో నివాసముండే సంతోష్ గంజిలో కూరగాయలు అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. 6 నెలల క్రితం ఆక్సిడెంట్లో అతని ఎడమ కాలుకు తీవ్ర గాయమైనది. ఇదివరకే 2 సార్లు ఆపరేషన్ జరిగింది. ఇంకా 2 లేదా 3 సార్లు ఆపరేషన్ చేయవలిసి ఉంది. అతనిది పేద కుటుంబం కావడంతో ఆదుకోమని కోరడంతో స్పందించిన శ్రీ కృష్ణ ఫౌండేషన్ వారు బాధిత కుటుంబానికి సుమారుగా రూ.6 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇందులో రూ.4 వేల కిరాణా సామాగ్రి, రూ. 2 వేల మందులు అందజేశారు.