మద్నూర్ బతుకమ్మ: పునర వాస కేంద్రాన్ని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం సందర్శించారు. మండలంలోని ఉన్నంత పాఠశాలలో పునర వాస కేంద్రం ఏర్పాటు చేశారు. డోంగ్లి మండలంలోని సిర్పూర్, పెద్ద టాక్లి, చిన్న టాక్లి, గ్రామంలో వరద నీరు ఎక్కువగా రావడంతో బాధితులకు పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. ఎవరు అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండాలని అన్నారు. మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. అరటి పండ్లు, మధ్యాహ్న భోజనం అందించారు. బాన్సువాడ డిఎస్పి, బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ, తాహసిల్దార్ ఎండి ముజీబ్, పోలీసులు నాయకులు తదితరులు ఉన్నారు.

